పెనుకొండ : రాష్ట్రంలో నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సంబరాలు చేసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సవితమ్మ మాట్లాడారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. టిడిపి మినీ మేనిఫెస్టోను ప్రకటించడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు మాధవ నాయుడు, వెంకటరమణ, శ్రీరాములు, ఆంజనేయులు, వెంకటేష్, కంబాలపల్లి సర్పంచ్ మంజు, త్రివేంద్ర నాయుడు, మాజీ వైస్ సర్పంచి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.










