ప్రజాశక్తి-ఆత్మకూరు అధైర్య పడొద్దని ఎల్లవేళలా పోలీస్‌శాఖ అండగా ఉంటుందని ఎఆర్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ భార్య అనితకు ఎస్పీ కె.శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఇటీవల అనంతపురం సమీపంలోని ఇస్కాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎఆర్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ మృతిచెందగా భార్య అనిత తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆమె పూర్తిగా కోలుకుని ఆత్మకూరులోని స్వగృహానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆమె వద్దకు చేరుకుని పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కు లేరని బాధపడకండి.. పోలీసు శాఖ ఎప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు ఎఆర్ డీఎస్పీ మునిరాజ్, సి.ఐ నరేంద్రరెడ్డి, ఆర్‌ఐ రాముడు, ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్‌పాల్, మసూద్‌వలి, తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు










