Mar 17,2023 23:01

matladutunna ramakrishna

ఎలిమెంటరీ విద్యార్థుల సామర్థాలు పరిశీలన
ప్రజాశక్తి - మొవ్వ
'టీచింగ్‌ అట్‌ రైట్‌ లెవెల్‌'లో భాగంగా విద్యార్థుల చదువులో శక్తిసామర్ధ్యాలను ప్రథమ్‌(ముంబై) ఎన్జీవో సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ అమరోజు రామకృష్ణ పరిశీలించారు. మొవ్వ మండలంలోని డిఎంఆఫ్‌ కూచిపూడి ఎంపీ ఎలిమెంటరీ పాఠశాల, పెదపూడి యూపీ పాఠశాలలో శుక్రవారం 3,4,5 తరగతుల విద్యార్థులో గల సామర్ధ్యాలను పరిశీలించి దీనిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ సూచనలను అనుసరించి గతేడాది నవంబర్‌ నెలలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా శుక్రవారం రెండోసారి నిర్వహించారు. అప్పటికి ఇప్పటికీ విద్యార్థులు చదవటంలో , రాయటంలో కొంతమేర మెరుగుపడ్డారని ఆయన వెల్లడించారు. తెలుగు, లెక్కలలో ఆయా తరగతులలో విద్యార్థులను పరీక్షించి మెరుగైన విద్యార్థులను గ్రూప్‌-1గా, చదువులో వెనకబడిన వారిని గ్రూప్‌-2గా విభజించి వీరిపై మరింత దష్టి పెట్టేందుకు ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. డి ఎంఆఫ్‌ కూచిపూడి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నంబూరి నాగరాజు, సహ ఉపాధ్యాయిని దిల్షాద్‌ బేగం, సిఆర్పి తాతా సమర్పణ రావు పాల్గొన్నారు. పెదపూడి యూపీ స్కూల్లో హెచ్‌ఎం జి ఉషారాణి పర్యవేక్షణలో జిల్లా కోఆర్డినేటర్‌ రామకష్ణ ఆయా విద్యార్థులను పరీక్షించారు.