Aug 07,2023 19:54

పూజలు నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ఎల్‌ఎల్‌సి ప్రధాన కాలువ ద్వారా నీటిని మళ్లించి చెరువులు నింపేందుకు చొరవ తీసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి, రాంపురం రెడ్డి సోదరులకు ఆరు గ్రామాల ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మండలంలోని ఎల్‌ఎల్‌సి ప్రధాన కాలువ వద్ద వైసిపి మండల ఇన్‌ఛార్జీ, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ సి.విశ్వనాథ్‌ రెడ్డి, నాయకులు కాంతారెడ్డి రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న రాంపురం రెడ్డి సోదరుల కృషితోనే నీటి మళ్లింపు సాధ్యమైందని పేర్కొన్నారు. మండలంలోని వగరూరు రిజర్వాయర్‌ (సూగూరు మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు)కు తుంగభద్ర డ్యాం ద్వారా విడుదలైన నీటిని ఎల్‌ఎల్‌సి ప్రధాన కాలువ ద్వారా మళ్లించి చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చూడాలని జాలవాడి, కంబాలదిన్నె, వగరూరు, వి.తిమ్మాపురం, బూదూరు, సూగూరు గ్రామాల ప్రజలు రాంపురం రెడ్డి సోదరులను కలిసి సమస్యను ఇటీవల వివరించారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఎల్‌ఎల్‌సి అధికారులతో మాట్లాడి రాగిమాన్‌దొడ్డి వద్ద ఉన్న ఎల్‌ఎల్‌సి ప్రధాన కాలువ ద్వారా వాగు మార్గంలో తుంగభద్ర డ్యాం జలాలను వగరూరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు. వారి ప్రయత్నం వల్ల ఎల్‌ఎల్‌సికి నీటి సరఫరా అయిందని, తాగు, సాగు నీటికి పరిష్కారం దొరికిందని తెలిపారు. వీరారెడ్డి, సర్పంచి లింగా రెడ్డి, ఎంపిటిసి చినన్న పాల్గొన్నారు.