ప్రజాశక్తి-యర్రగొండపాలెం
యర్రగొండపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా సింగారెడ్డి నాగమణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏఎంసీ చైర్మన్ నాగమణి తరుపున ఆమె భర్త సింగారెడ్డి పోలిరెడ్డి రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ఉత్తర్వుల కాపీ అందుకున్నారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, పుల్లలచెరువు కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు యండ్రపల్లి స్వామి, పబ్బిశెట్టి శీను తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. నూతనంగా నియమితులైన కమిటీ : గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్, చైర్మన్‌గా సింగారెడ్డి నాగమణి పోలిరెడ్డి, వైస్ చైర్మన్‌గా కొర్రపోలు జయరావు, డైరెక్టర్లుగా హసవత్ హనిమిబారు, కుక్క ముడి మరియమ్మ, జడ్డా కుమారి, పల్లె సుస్మిత, బత్తుల గంగమ్మ, దూదేకుల కాశమ్మ, దుగ్గంపూడి అంబమ్మా, పంది గంగరాజు, రేల వెంకట రమణారెడ్డి, అల్లు రాంభూపాల్ రెడ్డి, దోగిపర్తి సంతోష్ కుమార్, కొల్లా నారాయణమ్మ, దూదేకుల చిన్న మౌలాలి ఉన్నారు.










