- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
- చోద్యం చూసిన విద్యాశాఖ అధికారులు
ప్రజాశక్తి-ఆదోని : నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపరేఖలు మారుస్తామని కార్పొరేట్ తరహాలో విద్యార్థులకు సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతూనే ఉన్నారు. కార్యరూపం మాత్రం దాల్చడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు 106 మంది విద్యార్థులు రేకుల షెడ్డులో 1నుండి 5వ తరగతి కొనసాగుతుంది.అక్కడ టాయిలెట్, త్రాగునీరు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ఘటన ఆదోనిలోనే విజయభాస్కర్ రెడ్డి కాలనీలోని ఎన్ రామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో కొనసాగుతున్న పరిస్థితి. జగన్ మావయ్య ఒకే రూమ్ లో 106 మంది ఎలా ఉండాలని విద్యార్థులు వాపోతున్న పరిస్థితి.
ఆదోని పట్టణం లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్న ఎన్ రామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సౌకర్యాలు లేక రేకుల షెడ్ లొనే విద్యాభ్యాసం చేస్తున్నారు. కనీసం బాత్రూములు టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చిన్నారులు వాపోతున్న పరిస్థితి త్రాగడానికి నీటి సౌకర్యం కూడ సరిగ్గా లేని దుస్థితిని చిన్నారులు చెబుతున్నారు. అసలే మురికివాడ కావడం వల్ల పేదలు కూలీల కుటుంబాలకు చెందిన చిన్నారులే ఈ పాఠశాలకు వస్తున్నారు. పాఠశాలకు పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడంతో రేకుల షెడ్ లో పాఠాలు చెప్తున్నారు. గోడల్లో క్రాక్ రావడంతో ఎప్పుడు కూలిపోతుందో అని భయాందోళన గురవుతున్నారు . విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పత్రికా ముఖంగా గతంలో ప్రచురించగా స్పందించిన అధికారులు ఈ పాఠశాలకు నాడు నేడు కింద శాశ్వత భవనం మంజూరు చేశారు విద్యార్థుల సమస్యలను పలుమార్లు వెలికితీయగ అధికారులు స్పందించి నాడు-నేడు కింద భవన నిర్మాణానికి 42 లక్షల నిధులు మంజూరు చేశారు. రేకుల షెడ్డు కూడా ఉపాధ్యాయులే అద్దెను చెల్లిస్తున్నారు.
అయితే 106 మంది విద్యార్థులకు ఒకే గది నిర్మించడం వలన స్థలం చాలదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు అక్కడ ఇంకా స్థలం మిగిలి ఉందని అధికారులు మరికొన్ని గదులు నిర్మిస్తే విద్యార్థులకు సౌకర్యంగ ఉంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు
106 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకి ఒక రూమ్ కట్టడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మునిసిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగిన గది నిర్మాణం: ఎం రామయ్య స్కూలు రేకుల షెడ్డులో కొనసాగుతుందని పత్రికా ముఖంగా పలుమార్లు వెలుకి తీయగా ప్రభుత్వ స్పందించి రూ 42 లక్షలు నాడు నేడు కింద నిధులు మంజూరు చేసింది.
నాడు-నేడు కింద గది లెంత్ లెవెల్ లో నిర్మాణం జరిగింది పని చేపిస్తున్న హెడ్ మాస్టర్ ను deputation పై పంపడంతో ఆ పనులు కూడ ఆగిపోయాయి.
మునిసిపల్ అధికారులు,ఆదోని MEO మేల్కొని నూతనంగా నిర్మిస్తున్నా N రామయ్య మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో మరిన్ని గదులు కట్టాలని అలానే ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్ కూడ ప్రమాదకరమైన పరిస్థితి లో ఉన్నందున విద్యార్థుల కు సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నాడు నేడు కింద జరుగుతున్న పనులకు ఆటంకం కలగకుండా ఇక్కడ విధులు నిర్వర్తించే హెచ్ఎంను తిరిగి నియమించాలని కోరుతున్నారు.
వివరణ ఇచ్చిన ఎంఈఓ : ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాల మేరకు లేబర్ కాలనీ మున్సిపల్ హైస్కూల్ కు తాత్కాలికంగా సబ్జెక్టు టీచర్ గా ఎం రామయ్య స్కూలు హెచ్ఎం కేటాయించామన్నారు స్కూల్ భవనం పనులకు ఆటకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు త్వరలోనే అదనపు నిర్మాణం కూడా జరిగేలా చర్యలు తీసుకుంటాము సర్దుబాటు పూర్తికాగానే హెచ్ఎం ను తిరిగి అక్కడికే పంపుతామని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శివరాములు తెలిపారు.










