Jun 30,2023 21:59

ఉల్లాసంగా జరుగుతున్న ఎడ్లబండ్ల పరుగు పందెం పోటీలు

పుట్టపర్తి రూరల్‌: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏకాదశి పండుగ సందర్భంగా శుక్రవారం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. మండల పరిధిలోని నిడిమామిడి, కొట్లపల్లి, కప్పల బండ, కోవెలగుట్టపల్లి గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శనలు, పోటీలను గ్రామస్తులు ఉత్సాహంగా నిర్వహించారు. నిడిమామిడి గ్రామంలో నిడిమామిడమ్మ ఆలయం ముందు భాగాన ఈ ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. శనివారం ఆలయం ముందు ఉట్ల పరుష నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కప్పల బండ గ్రామం లోని పోతులప్ప స్వామి దేవాలయం ముందు , ప్రధాన రహదారిలో యువకులు ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. అదేవిధంగా కోవెలగుట్టపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ప్రతి ఏటా నిర్వహించే ఎడ్లబండ్ల పోటీలను ఈసారి కూడా గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో మండల వాసులు పాల్గొన్నారు. అంతేకాక జగరాజుపల్లి సమీపంలో కొండపై వెలసిన ఓబులేశ్వర స్వామి కొండకు భక్తులు పోటెత్తారు. కొండ క్రింది భాగాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో దాదాపు 5,వేల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.