ప్రజాశక్తి బత్తలపల్లి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో మరో ఏడాది పాటు పార్టీ కార్యక్రమాలతో కష్టపడితే టిడిపిని అధికారంలోకి తీసుకురావచ్చునని ధర్మవరం టిడిపి ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రమైన బత్తలపల్లి లోని గుండా కళ్యాణమండపంలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ శిక్షణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ధర్మవరం మైల్ స్టోన్ గా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిటాల శ్రీరామ్, ఆర్టిఎస్ విభాగం నుంచి మనోహర్ నాయుడు, మన టీడీపీ నుంచి రామాంజనేయులు, టెలిగ్రామ్ భాట్ నుంచి రమణ వెంకట పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర, పార్లమెంటు స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి, టిడిపి కుమ్మర శాలివాహన సాధికారత రాష్ట్ర కన్వీనర్ మదనాపు కుమ్మర పోతులయ్య, టిడిపి కన్వీనర్లు గోనుగుంట్ల నారాయణరెడ్డి, ఆర్‌టిఎస్ ధర్మవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బోయపాటి అప్పస్వామి నాయుడు, కమతం కాటమయ్య, చల్లా శ్రీనివాసులు, శ్రీనివాసులు, చిట్రం నాగభూషణ, రంగానాయుడు, నెట్టంరమణ, జగ్గు, జక్కంపూడి నాగభూషణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.










