ప్రజాశక్తి-మంత్రాలయం : మండల కేంద్రమైన మంత్రాలయంలోని పాత ఊరులో వెలసిన వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి స్థానికులైన మధుసూదన ఆచారి అనే భక్తుడు 16 వేల రూపాయల విలువ గల వెండి చెంబు ను పూజారులకు విరాళంగా అందజేశారు. సోమవారం దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి పండుగ సందర్భంగా వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో జరుగు నిత్య పూజలకు వినియోగించాలని కోరుతూ 2 వందల గ్రాముల వెండి చెంబును విరాళంగా ఇచ్చినట్లు దాత మధుసూదన ఆచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యులు జంగం సుజాత శంకర్ ఆలయ అర్చకులు రుద్రయ్య స్వామి, లింగయ్య స్వామి ఉన్నారు.










