May 22,2023 22:05

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : ఆటో కార్మికు సమస్యలపై కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొనిజయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప కోరారు. సోమవారం పట్టణంలోని కల్లూరు ఆటో స్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, కొటిపి ఆటోస్టాండ్‌, వివిధ ఆటో స్టాండ్‌లలో ధర్నాకు సంబందించిన గోడపత్రికలు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, ఆటో యూనియన్‌ పట్టణ కార్యదర్శి అత్తర్‌ బాబా, మోదస్టాండ్‌ సురేష్‌ బాలు, ఆర్టీసీ బస్టాండ్‌ అంజనప్ప, రామాంజి, మధు, కొటిపి ఆటోస్టాండ్‌ గంగప్ప, రమేష్‌, నాగరాజు, రెహమాన్‌, ఖలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్‌: ట్రాన్స్‌పోర్టు రంగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఈనెల 23న నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆటో యూనియన్‌ నాయకులు బాబావలి కోరారు. ఈ సందర్భంగా పెడపల్లి బస్టాండ్‌వద్ద సోమవారం ఆటో డ్రైవర్లతో కలిసి ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం బాబావలి మాట్లాడుతూ ఆటో కార్మికులపై పోలీసులు వేధింపులు ఆపాలని, ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు సుహెల్‌బాషా, చలపతి, దాదా పీర్‌, బాబ్జాన్‌, నాగేంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.