అనంతపురం కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ నుంచి సమరభేరి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి తెలిపారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఇందుకు సంబంధించిన గోడపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంటు ఛార్జీలు, ధరలు పెరిగిపోయాయన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగ యువతను మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్, వలీ, నగర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ సీన, రాజు, వరలక్ష్మి, గపూర్, ఆటో యూనియన్ నాయకులు ఆదినారాయణ, శివ, గపూర్, రామ లింగా రెడ్డి, కెవిపిఎస్ నగర నాయకులు రాజు, అవాజ్ నగర నాయకులు ఇస్మాయిల్, భవన నిర్మాణ కార్మిక సంఘం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు










