Nov 02,2023 22:19

ప్రజాశక్తి-అమలాపురం
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం సేకరణ తదితర అంశాల సన్నద్ధత పై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు సమీక్షించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ నుండి 22 మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ నుండి 22 మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం సేకరణ అంశాల సన్నద్ధత పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే ధాన్యం సేకరణ సంబంధించి మిల్లర్లతో చర్చించామన్నారు. గోనె సంచులు ఆర్‌బికెలకు సరఫరా చేస్తారని, వాటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌బికెల్లో వీలైనంత ఎక్కువ సంఖ్యలో గోనెసంచులు నిల్వ చేయాలని ఆదేశించారు. ధాన్యం రవాణాకు వినియోగించే వాహనాలన్నిటిలో జిపిఎస్‌ సిస్టం అందు బాటులో ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 524 వాహనాలు ధాన్యం రవాణా కొరకు రిజిస్ట్రేషన్‌, జిపిఎస్‌ సిస్టం ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకి సంబంధించి కొన్ని చోట్ల సిబ్బంది కొరత ఉన్న దష్ట్యా సిబ్బందిని నియమించే చర్యలు చేపట్టామని త్వరలో నియామక ఉత్తర్వులు అందిస్తామన్నారు. మిల్లులను మండలాలు వారిగా మ్యాపింగ్‌ చేయడం జరిగిందని ఆ యొక్క మండలాలు టార్గెట్‌ పూర్తయిన తర్వాత పక్క మండలా లకు ధాన్యాన్ని పంపిస్తారన్నారు. తేమ శాతాలలో వ్యత్యాసాలు ఉత్పన్నం కాకుండా టెక్నికల్‌ అసిస్టెంట్లు స్వయంగా రైతు క్షేత్రాలలో కల్లాల వద్దకు వెళ్లి నాలు గైదు చోట్ల ధాన్యం రాశుల్లో శాంపు ల్స్‌ ను సేకరించి శాస్త్ర యుక్తంగా పరీక్షలు నిర్వహించి కచ్చితంగా తేమ శాతాన్ని నిర్ధారించాలని స్పష్టంచేశారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ ఎస్‌.సుధాకర్‌, డిఎస్‌ఒ ఎ.పాపారావు, జిల్లా రవాణా అధికారి అశోక్‌ ప్రతాప్‌ రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు, జిల్లా సహకార అధికారి రాధాకష్ణారావు, వ్యవసాయ మార్కెటిం గ్‌ శాఖ సహాయ సంచాలకులు కే విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.