ధాన్యం డబ్బులు ఎందుకు చెల్లించరు : వర్ల
ప్రజాశక్తి-పమిడిముక్కల
ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లింపుల్లో రాష్ట్రప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని టిడిపి పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్ రాజా విమర్శించారు. పమిడిముక్కల మండలంలోని కృష్ణాపురం శివారు రాజారావుపేటలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా వర్ల కుమార్‌రాజా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదన్నారు. లంకపల్లి, అమీనాపురం రోడ్లు నిర్మించకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. పామర్రు నియోజకవర్గంలో ఇసుక, మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పమిడిముక్కల మండల అధ్యక్షులు రాజులపాటి శ్రీనివాసరావు, మోటూరు వెంకటసుబ్బయ్య, లింగమనేని బాబూరావు, అమ్మిరెడ్డి ఓం శివయ్య, అబ్బాస్, రాజేష్, యార్లగడ్డ రామాంజనేయులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.










