న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్, తెలంగాణ, గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ డెంగీ కలకలం సృష్టిస్తుంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు, సంసిద్ధతపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన కేంద్ర ఆరోగ్యశాఖ.. డెంగీ నివారణ, నిర్మూలన చర్యలు పటిష్ఠం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 95వేల డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. 91 డెంగీ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయి.










