- గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న వి ఆర్ ఓ, పోస్టులన్ని వెంటనే భర్తీ చేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరత్నం మరియు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్ ల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏ నుండి సీనియార్టీ ప్రకారం నైట్ వాచ్మెన్లు, అటెండర్లు, చైన్మ్యాన్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉంటే అన్ని ఖాళీల్లో వీఆర్ఏలతోనే భర్తీ చేయాలని మరియు వీఆర్ఏ నుండి విఆర్వోగా ఇంటర్మీడియట్ తో ప్రమోషన్ ఇవ్వాలని గతంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కలక్టర్ సానుకూలంగా స్పందించారని అయితే సమస్య పరిష్కారం కాలేదన్నారు. కనుక మరో సారి తమ సమస్యని కలక్టర్ దృష్టికి తీసుకు రావడానికి వచ్చామన్నారు. కాబట్టి ఉన్నతాధి కారులు తమ న్యాయ మైన డిమాండ్స్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు వెన్న వెంకటేశ్వరావులు ఉన్నారు.










