Oct 21,2023 10:48

ప్రజాశక్తి-ఉంగుటూరు(ఏలూరు జిల్లా) :  పెద్దాపురం నుంచి నడుచుకుంటూ విజయవాడ వెళ్తున్న భవాని మాలదార భక్తుడు తూరుపెల్లి మణికంఠ (22) శనివారం తెల్లవారుజామున ట్రావెల్ బస్సు ఢీకొని మృతి చెందాడు. స్థానిక కొండ్రెడ్డి నగర్ శివారు వద్ద వెనుక నుండి వచ్చే వరపుత్ర ట్రావెల్స్ కి చెందిన బస్ ఢీ కొట్టింది. ప్రమాదంలో అతని తల వెనుక బలమైన గాయం అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.  పోలీసులు కేసు నమోదు చేశారు.