ప్రజాశక్తి-కనిగిరి: వైసిపి దౌర్జన్య పాలనకు తగిన గుణపాఠం చెప్పాలని కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపాలెం, సాయంత్రం కనిగిరి మండలంలోని బిజ్జంవారిపల్లి, వెన్నపూసవారిపల్లి, వెంకటేశ్వరపురం గ్రామాలలో మూడోరోజు మన ఊరు మన ఉగ్ర కార్యక్రమం కొనసాగింది. ఆయన పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చైతన్య పరుస్తూ ముందుకు సాగారు. బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. ప్రజలతో ముఖా ముఖి నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, నుదురుపాటి సుబ్బయ్య, మాలపాటి ఓబుల్‌రెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, బారుమామ్, పాలూరి సత్యం, చింతలపూడి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.










