Oct 24,2023 23:55
జమ్మిచెట్టుకు పూజల్లో పాల్గొన్న శిద్దా రాఘవరావు దంపతులు

ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి మండలంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక హరిహర క్షేత్రంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న విజయదశమి వేడుకలల్లో ముగింపు రోజు రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వారికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సముదాయంలోని వివిధ ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. తొమ్మిది రకాల నైవేద్యాలు, సారెలు సమర్పించారు. శమీ వృక్షానికి విశేష పూజలు నిర్వహించి, బాణాన్ని ఎక్కుపెట్టారు. పారువేట కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు తిలకించడానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శిద్దా వెంకటేశ్వర్లు, సుబ్బమ్మ ట్రస్టు సభ్యులు శిద్దా పాండురంగారావు, సుధావళి దంపతులు, శిద్దా వెంకటేశ్వరరావు, శిద్దా సాయిబాబు, శిద్దా పెదబాబు, శిద్దా కాశీవిశ్వేశ్వరరావు, ఆర్యవైశ్య మహిళలు చాట్ల సువర్చల, కొణిజేటి సువర్ణ, ధనలక్ష్మి, మాధవి, వాసవి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాగులుప్పలపాడు: మండలంలోని వివిధ గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ దేవస్థానాల్లో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. సోమవారం అత్యంత వైభవంగా విద్యుత్‌ కాంతులతో గ్రామోత్సవం జమ్మిచెట్టు వద్ద పార్వేట పూజలు నిర్వహించారు. ఉప్పుగుండూరు శివాలయం దేవస్థానం సంబంధించి పూజారి రంగయ్య పంతులు జమ్మిచెట్టువద్ద పార్వేట పూజలు నిర్వహించారు. వేణుగోపాళ స్వామి దేవస్థానం సంబంధించి చైర్మన్‌ పెంట్యాల జ్యోతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజారి దివి శ్రీధర్‌బాబు పార్వేట పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
కొండపి: కొండపి పొలీసు స్టేషన్‌లో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమాలు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మాట్లాడుతూ కొండపి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొండపి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.