May 27,2023 22:19

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

        పుట్టపర్తి అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు నెలల్లో డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని సంకల్పించారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులంతా కలిసి కృషి చేద్దామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు పిలుపుని చ్చారు. కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ణయించిన విధంగా జిల్లాలో డ్రగ్స్‌ నిర్మూలనలో పురోగతి సాధిస్తామన్నారు. డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే దుష్పరిణా మాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని సచివాలయాల్లో డ్రగ్స్‌ పోస్టర్ల ను ప్రదర్శించాలన్నారు. విస్తతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు జిల్లాకు వచ్చే అవకాశం ఉండడంతో వారి ద్వారా డ్రగ్స్‌ సంస్కృతి వచ్చే అవకాశం ఉందని, పరిశ్రమల్లో ఎవరైనా డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నారా అని లేబర్‌ శాఖ అధికారులు పరిశీలించాలన్నారు. జిల్లాలోకి డ్రగ్స్‌ రాకుండా అరికట్టాలని అందుకు పోలీసులతో పాటు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కర్నాటక సరిహద్దుల్లో, జాతీయ రహదారుల్లో తనిఖీలు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్‌పి మాధవరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ను అరికట్టడానికి కృషి చేస్తున్నామని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా సమాచారం అందితే వెంటనే తమకు చేరవేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పి రామకష్ణ ప్రసాద్‌, సెబ్‌ అధికారి రవికుమార్‌, ఇంటెలిజెన్స్‌ డిఎస్‌పి గోవింద్‌, ఆర్డీవో భాగ్యరేఖ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శివ రంగ ప్రసాద్‌, డిఎంహెచ్‌ఓ కష్ణారెడ్డి, జిల్లా ఫారెస్ట్‌ అధికారి రవీంద్రనాథ్‌ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.