Apr 22,2023 22:31

kollu ravindra tho muslim lu

దర్గా అభివృద్ధికి కొల్లు రూ.లక్ష విరాళం
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
రంజాన్‌ పండగ పురస్కరించుకుని స్థానిక ఉల్లింగి పాలెం ఈద్గా దర్గాలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా దర్గా అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, ముస్లిం మైనార్టీ నాయకులు ఇలియాస్‌ షాష, ఖాజా, అబ్దుల్‌ అజీజ్‌, అమీర్‌, ఫిరోజ్‌, ఖదీర్‌, అబ్దుల్‌ అజీమ్‌, భాజాని, ఆరిఫ్‌, ఫహీం, ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.