Oct 09,2023 21:41

ప్రజాశక్తి - చాట్రాయి
   పర్వతాపురం గ్రామంలో డ్రెయినేజీ సమస్య ముందుగానే గ్రహించి, ప్రతి కాలనీలో సర్పంచి శివరామకృష్ణ డ్రెయినేజీలు నిర్మించారు. ఇప్పుడు ఎవరికి వారు వాళ్ల ఇంటి ముందు మేరువ కోసం మట్టిని డ్రెయినేజీలో పోసి డ్రెయినేజీని పూడ్చి వేసేశారు. ఈ సమస్యతో కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా, దీన్ని గ్రహించి సమస్యను తొలిగేలాగా మరల డ్రెయినేజీని సర్పంచి సోమవారం తీయించారు. ఈ సందర్భంగా సర్పంచి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు డ్రెయినేజీ నీళ్లు మీ ఇళ్ల ముందు ఉండకూడదని, ఒకవేళ ఉంటే మీకే నష్టం కలుగుతుందని మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ జ్వరం, అనేక వ్యాధులు వస్తాయని తెలిపారు.