Aug 28,2023 21:44

విద్యుత్తు శాఖ కార్యాలయంలో వేచిచూస్తున్న ఎసిబి అధికారులు

ప్రజాశక్తి-మక్కువ : లంచం తీసుకుని ఎసిబి అధికారులకు ఆదివారం రాత్రి చిక్కకుండా తప్పించుకున్న ఎఇ శాంతారావు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకూ తెలియలేదు. స్థానిక విద్యుత్తు శాఖ కార్యాలయంలో ఎసిబి డిఎస్‌పి రామచంద్రరావు, సిఐ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది... ఎఇ కోసం వేచి చూశారు. వారికి అందిన సమాచారం మేరకు సిబ్బంది కోన శాంతిశ్వరం ఆలయం వద్ద వెతికారు. మండల కేంద్రం మక్కువలో కూడా అణువణువూ వెతకసాగారు. దీంతో ఎసిబి అధికారులు చేసేది ఏమీ లేక వెనుతిరిగారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎసిబి డిఎస్‌పి కూడా ఉన్నారు.