కళ్యాణదుర్గం : అవినీతి, అక్రమాలు సాగిస్తున్న దోపిడీ ప్రభుత్వం వైసిపిని రాష్ట్రం నుంచి తరిమేద్దామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యకు ష్యూరిటీ - బాబు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు చంద్రబాబు రాయదుర్గం, కళ్యాణదుర్గంలో పర్యటించారు. మధ్యలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడు వివాహ రిసెప్షన్ జరుగుతున్న కౌకుంట్ల గ్రామానికెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం రాయదుర్గం పట్టణంలో పల్లే ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఇందులో యువత, మహిళలు, రైతులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాయంత్రం కళ్యాణదుర్గంలో పర్యటించారు. ఒంటిమిద్ది గ్రామ సమీపంలో అర్ధాంతరంగా ఆగిన హంద్రీనీవా కాలువ పనులు, లిఫ్టు పరికరాలను పరిశీలించి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. రాత్రి టీ సర్కిల్‌లో నిర్విహిచిన బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ పాలన ఆరంభం నుంచి అరచాకాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో సాగుతోందన్నారు. రాష్ట్రభవితవ్యాన్ని భష్ట్రుపట్టించారని ఎద్దేవాచేశారు. అడుగడుగునా వైసీపీ నేతలు అరచకాలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పథకాలన్నీ నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని సంక్షభంలోకి నెట్టవేసిన ప్రభుత్వం వైసిపి అన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం రైతాంగం కోసం రూ.968 కోట్లతో బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లందించేందకు హంద్రీనీవాను ప్రారంభించి 26శాతం పనులు పూర్తి చేస్తే ఎన్నికల అనంతరం ఒక గంప మట్టిని కూడా తీసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. సిగ్గులేని ముఖ్యమంత్రి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని ఆకోశ్రం వెళ్లగక్కారు. జిల్లా అభివృద్ధి కోసం జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. బిందు, తుంపర సేద్యం పరికరాలను నాడు 90శాతం సబ్సీడీతో రైతాంగాన్ని ఆదుకున్న ఘనత టీడీపీదే అన్నారు. నాడు మద్యపాన నిషేదం అంటూ నేడు విచ్చలవిడిగా మ్యదం విక్రయిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారన్నారు. మంత్రి ఉషాశ్రీచరణ్ సుజలాన్ కంపెనీ ప్రతినిధులను బెదిరించి 160 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్షతో కొనుగోలు చేశారని ఆరోపించారు. అదేభూమిని తాను లక్షకు కొనుగోలు చేసి పేదలకు పంచిపెడతానిని అందుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సిద్ధమా అని ప్రశ్నించారు. సైకో సీఎం పోవాలంటే ఇంటికో సైనికుడు తయారై టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరాయచౌదరి, ఉమామశ్వరనాయుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పార్థసారథి, పరిటాల శ్రీరాం, గుండుమలతిప్పేస్వామి, మధుమంచి స్వరూప, మోరేపల్లి మల్లికార్జున, రామ్మోహన్‌చౌదరి, చంద్ర దండు ప్రకాష్‌నాయుడు, మారుతీచౌదరి, వైపి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.










