Oct 19,2023 00:11

గుర్రాలు, డోలీలతో పాదయాత్ర చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-అనంతగిరి:పివిటీజీ మారుమూల గ్రామాలైన బల్లగరువు, దాయెర్తి, మడ్రెబు వరకు రోడ్డు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యాన బుధవారం గుర్రాలు, .డోలీలతో సుమారు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభుడు కె.గోవిందరావు, మండల పీవిటి ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు సుదాకర్‌ మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పీవిటిజీ గ్రామాలకు రోడ్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. పిన్నకోట, కివర్ల, జీనబాడు పంచాయతీ పరిధి సరిహద్దు గ్రామలైన కరకవలస, . రాచకిలం, పీచుమామిడి, కోటగరువు, గుమ్మం, మడ్రెబు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.మండల కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీల పరిధిలో కొండ శిఖరం ఉన్న మడ్రేవు, తునిసీబు,. దాయర్తి, గుమ్మంతి, 6.పీచు మామిడి, కరకవలస, రాచకలం, రెడ్డిపాడు, కోటగరవు గ్రామాలల్లో సుమారు 2000 మంది పివిటిజీ తెగలకు చెందిన ఆదివాసి గిరిజనులు నివసిస్తున్నారని తెలిపారు. గర్బీణిలు, ఇతర వ్యాధులతో బాదపడుతున్న గిరిజనులు వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డోలీమోతలు, గుర్రాలతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత సంవత్సరం ఆరుగురు గిరిజన రోగులను డోలీలో మోసుకుంటూ రోడ్డు మార్గానికి వెళుతుండగా సకాలంలో సరైన వైద్యం అందక ఐదుగురు మరణించినారన్నారు. రోడ్డు మార్గం లేకపోవడంతో రేషన్‌ బియ్యం తీసుకోవాలంటే 30 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామ సచివాలయం, బ్యాంకులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారన్నారు.జగనన్న ఇల్లు కట్టుకోవాలంటే గుర్రాలతో మెటీరియల్‌ను గిరిజనులే మోసుకొవాల్చిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా మంచినీటి పథకాన్ని నిర్మాంచాలంటే ్ల దూరంలో ఇసుకన, సిమెంట్‌, ఇతర సామగ్రిని గుర్రాలపై మోసుకెళ్లి తెచ్చుకోవాల్సిన గతి ఏర్పడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిమవాసీ గిరిజనులు గేమ్మెల. జన్మరాజు, కొర్రా సుబ్బారావు, కొర్రా జమ్ములు, ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.