ప్రజాశక్తి - మంత్రాలయం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆధారాలు చూపాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాఘవేంద్ర సర్కిల్‌లో టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో 'మేము సైతం' అంటూ లీగల్ సెల్ (లాయర్లు) రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. న్యాయవాదులు రాజకీయాల్లో రాణించి సేవలు అందిస్తున్నారని, అలాంటి వారికి పార్టీ సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. అలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కెఇ.కృష్ణమూర్తి, బిటి.నాయుడు లాంటి వారు చాలా మంది ఉన్నారన్నారు. అంతకుముందు లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు, జగన్నాథ్ రెడ్డి, గురు ప్రసాద్, కోసిగి వీరేష్, జక్కనగేని వెంకటేశ్వర్లు, హనుమేష్, తాయన్న, వీరేష్ గౌడ్, చావిడి వెంకటేష్, విజయరామిరెడ్డి, రవితేజ శెట్టి, రాజు, నరసింహులు, నాగరాజ్, జిలాన్ బాష, ఉదరు తదితర న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్ శెట్టి, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, పంపాపతి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు కోసిగి మారెప్ప, యోబు, రాగన్న, గవిగట్టు ఈరయ్య, గుడాలి ఈరయ్య, డీలర్ నరసన్న, అంపయ్య, జనార్ధన్, కేశన్న, అబ్దుల్ సాబ్, ప్రభాకర్ రెడ్డి, హుస్సేని, గుండేష్, మారేష్, లింగమూర్తి, ఐటిడిపి సాల్మన్ రాజ్, చిదానంద, లింగప్ప పాల్గొన్నారు.










