ప్రజాశక్తి-పత్తికొండ : ఈనెల 29న విజయవాడలో జరగబోయే దళిత రక్షణ యాత్రను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ పిలుపునిచ్చారు.శనివారం దళిత రక్షణ యాత్ర జీప్ జాత కెవిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తరి రమేష్ అధ్యక్షతన పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ చేరుకుంది. కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా కెవిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీర శేఖర్ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అరికట్టాలని డిమాండ్ చేశారు.దళితులు, గిరిజనుల ,మైనార్టీల పై దాడులు అత్యాచారాలు మూత్ర విసర్జన వివిధ రూపాల్లో వివక్షతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వతంత్రం వచ్చినప్పటికీ గ్రామాలలో దళితులు వివక్షకు గురవుతున్నారని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులకు పెన్షన్ వయసు 45 ఏళ్లకు తగ్గించి 5000 రూపాయలు మంజూరు చేయాలని , స్మశానాలలో పని చేసే వారికి నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని ప్రతి దళిత కుటుంబానికి ఆత్మగౌరవంగా బతికేందుకు రెండు ఎకరాల భూమి ఇవ్వాలని ,మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.దళిత గిరిజనులకు ఇస్తున్న 2 యూనిట్ల ఉచిత విద్యుత్ను 3 యూనిట్లకు పెంచాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. ఉపాధి పనులను 200 రోజులకు పెంచి 600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు . రైతులు కార్మికులు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పెద్దహుల్తి సురేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దస్తగిరి సిఐటియు జిల్లా నాయకులు వెంకటేశ్వర రెడ్డి కెవిపిఎస్ జిల్లా నాయకురాలు విజయమ్మ ప్రజా సంఘ నాయకులు సురేంద్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు










