Aug 09,2023 20:39

సమావేశంలో మాట్లాడుతున్న మహానంది

ప్రజాశక్తి-ఆలూరు
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందిందని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది విమర్శించారు. బుధవారం ఆలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆలూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మాల మహానాడు సీనియర్‌ నాయకులు జటప్పగారి వీరేష్‌, ఆస్పరి మండల కన్వీనర్‌ భరత్‌, వెంకటేష్‌, పరమేష్‌, మల్లికార్జున, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.