పాదయాత్రలో పాల్గొన్న వారిని సన్మానిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - గోనెగండ్ల
దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలతో పాటు వివక్ష, అంటరానితనంపై 'దళిత రక్షణ యాత్ర' చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్ బాబు తెలిపారు. శనివారం గోనెగండ్లలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత రక్షణ కోసం మండలంలోని అన్ని గ్రామాల్లో జీపుజాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత రక్షణ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఆదోని నుంచి కర్నూలు వరకు సిపిఎం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న వారిని అభినందించి సన్మానించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, మండల నాయకులు మారేష్, సంటెన్న, మారెన్న, శేఖర్, నరసన్న పాల్గొన్నారు.










