Jul 03,2023 22:11

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - లేపాక్షి : దళితుల భూములు దళితులకే కేటాయించాలని కెవిపిఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని కొండూరుపొలం లో కొండూరు, చిలమత్తూరు మండలం కొర్లకుంట దళితుల భూముల వన్‌బిలో దళితుల పేర్లు చేర్చాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కెవిపిఎస్‌ నాయకులు రమణ మాట్లాడుతూ దళితులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన భూముల వివరాలు వారి వన్‌బిలో తొలగించడం అన్యాయమన్నారు. కుసలవా ఆర్గాన్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ రామకృష్ణ ప్రసాద్‌ పేరును వన్‌బిలో ఎక్కించి దళితులకు మోసం చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితులకు న్యాయం చేయకపోతే కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఆ భూములను ఆక్రమించి సాగు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్‌, నారాయణ, మల్లికార్జున, గంగాధరప్ప తదితరులు పాల్గొన్నారు.