Sep 22,2023 19:52

కరపత్రాలను అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
దళితుల ఆత్మగౌరవం, ఉపాధి, సంక్షేమం, భద్రత కోసం కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో దళిత రక్షణ యాత్రలో భాగంగా ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించే జీపు జాతాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కెపి.నారాయణ స్వామి కోరారు. శుక్రవారం పట్టణంలో దళిత రక్షణ యాత్ర కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై రోజూ ఎక్కడో ఒకచోట కులవివక్ష, దాడులు, భూఆక్రమణ, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. 29న విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రంగప్ప, మైనా, పురుషోత్తం, గోవర్ధన్‌ పాల్గొన్నారు.