ప్రజాశక్తి-నెల్లూరు :డివైఎఫ్‌ఐ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 30వ డివిజన్ పరిధిలోని చంద్రబాబు నగర్ ప్రాంతంలో శనివారం డివైఎఫ్‌ఐ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్‌ఐ రూరల్ కార్యదర్శి కండే.కోటేశ్వరరావు హాజరై డివైఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. డివైఎఫ్‌ఐ రూరల్ అధ్యక్షులు వంకదారి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా డివైఎఫ్‌ఐ ఉందన్నారు. యువతి యువకులు భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో ప్రధాన పాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వాలు ప్రయివేటీకరణ చేయనివ్వకుండా, విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను స్థాపించే విధంగా పోరాడాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8వ తేదీన జరుగుతున్నటువంటి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. స్థానిక ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 18 డివిజన్ పరిధిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.










