ప్రజాశక్తి - ఆదోని
సాగు చేసిన పంటలకు డిసెంబర్ నెలాఖరు వరకు ఎల్‌ఎల్‌సి కాలువ ద్వారా నీరందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మి రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్.సుదర్శన్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోనిలోని టిబిపి కార్యాలయం వద్ద సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు అధ్యక్షత ధర్నా చేపట్టారు. కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఎఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకన్న, సిపిఐ సహాయ కార్యదర్శి విరుపాపురం నరసప్ప, బికెఎంయు డివిజన్ అధ్యక్షులు గంగన్న, రైతు సంఘం కార్యదర్శి ఎల్లప్ప, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కుమారస్వామి, విజరు, యూసుఫ్, మెకానిక్ వలీ, హర్షద్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు షేక్షావలీ, ఎఐటియుసి నాయకులు వైటి.భీమేష్, బసాపురం కరెంట్ ఈరన్న పాల్గొన్నారు.
వినతిపత్రం ఇస్తున్న నాయకులు










