May 12,2023 23:25

డీఎస్పీకి టిడిపి నాయకుల సన్మానం

        పుట్టపర్తి క్రైమ్‌ : పట్టణ డీఎస్పీ వాసుదేవన్‌ను శుక్రవారం టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మాజీ జెడ్‌పిటిసి చెన్నకేశవులు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అమ్మినేని కేశవ నాయుడు, ప్రకాష్‌ నాయుడు, బేకరీ నాయుడు, అంజి, సుధాకర్‌, సాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.