Jun 12,2023 22:14

అర్ధాంతరంగా ఆగిన భవన నిర్మాణం

ప్రజాశక్తి బుక్కపట్నం : మండల కేంద్రంలోని అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి నేటికీ నిధులు మంజూరు కాలేదని ఈ విద్యా సంవత్సరంలోనైనా నిధులు మంజూరైన అయ్యేనా అని జిల్లా టిడిపి అధికార ప్రతినిధి సామకోటి ఆదినారాయణ ప్రశ్నించారు. 2019లో నాలుగు ఎకరాల స్థలంలో మూడు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల పక్కా భవన నిర్మాణానికి పనులు ప్రారంభించారని చెప్పారు. ప్రస్తుతం ఈ భవనం మొండి గోడలకే పరిమితమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ కళాశాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రానికి సమీప దూరంలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేసి కళాశాల భవనాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.