Oct 04,2023 21:57

డిఎస్‌పిని సన్మానిస్తున్న ఎఎస్‌పి, పోలీసు అధికారులు

పార్వతీపురంరూరల్‌: మంగళగిరి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కు బదిలీపై వెళ్తున్న రిజర్వ్‌ డిఎస్‌పి బలివాడ నాగేశ్వరరావుకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎఎస్‌ఒ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, అధికారులు, సిబ్బంది దుశ్శాలువా, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఎఎస్‌పి నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పెరేడ్‌ నిర్వహణ తదితర అంశాలలో క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ డిఎస్‌పి మురళీధర్‌, పాలకొండ డిఎస్‌పి జివి కృష్ణారావు, ఇన్‌స్పెక్టర్లు ఆర్‌.వి.ఎస్‌.కుమార్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.