Apr 17,2023 22:07

ధర్నాలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ :భూ వివాదానికికారణమైన డిఎఒను సస్పెండ్‌ చేయాలన్న డిమాండ్‌తో భూ హక్కుదారులు పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కెవిపిఎస్‌ సంఘాలు నాయకులు, భాదితులకు మద్దతు తెలిపారు ఈ సందర్బంగా భాదితులు మాట్లాడుతూ ముష్రాఫ్‌, ముస్తారక్‌ ,ముక్రం లు మాట్లాడుతూ పట్టణంలో సర్వేనెంబర్‌ 453-1, 453-4,451 సర్వే నంబర్లలో 6 ఎకరాలు భూమి ఉందన్నారు. పూర్వీకుల ఆస్తి అన్యాయక్రాంతం కావడానికి హైకోర్టు ఉత్తర్వులను దారిమళ్లించి మోసం చేసిన పెనుకొండ తహసీల్దార్‌,ప్రస్తుత పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో డివిజనల్‌ పరిపాలన అధికారి గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డిఎఒ నాగరాజు నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ పాల సేకరణదారులు రామాంజి, వెంకటేష్‌, గిరి, పార్వతమ్మల నుండి ప్రాణహాని ఉందని సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన సబ్‌ కలెక్టర్‌ తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేసి తనను ఆరోపిస్తున్న వారిని పోలీసులతో చర్చించి బైండవర్‌ చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, వెంకట రాముడు, నారాయణ, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, నాయకులు కొండా వెంకటేశులు, చేనేత కార్మిక సంఘం నాయకులు నారాయణస్వామి,వజ్రం నాగప్ప, మహబూబ్‌ బాషా, రెడ్డప్పరెడ్డి, షరీఫ్‌, రాజు రావు, మహేష్‌, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.