Sep 04,2023 21:39

బలిజిపేట: వైద్య పరీక్షలను పరిశీలిస్తున్న డిఐఒ జగన్మోహన్‌రావు

ప్రజాశక్తి- బలిజిపేట: అరసాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు సోమవారం తనిఖీ చేశారు. ఒపి నిర్వహణ, మందులు, వ్యాక్సిన్‌ నిల్వలు, ల్యాబ్‌, ప్రసూతిగది, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల అనారోగ్య సమస్యలను పూర్తిగా తెలుసుకొని తగు చికిత్స అందజేయాల న్నారు. ఫార్మసీలో మందులు, రికార్డులు ఆయన పరిశీలించి, సీజనల్‌ రోగాలకు అవసరమైన మందులతో పాటుగా, అత్యవసర మందులు, పాము కాటు, కుక్క కాటు చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకో వాలన్నారు. వ్యాక్సిన్‌ నిల్వలు తనిఖీ చేసి, ఐఎల్‌ఆర్‌ శీతోష్ణస్థితి నిర్వహణను పరిశీలించారు. ఇన్వర్టర్‌, బ్యాటరీ పని తీరును పరిశీలించారు. ప్రసూతి గదిని పరిశీలించి ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం ఆయన ఆసుపత్రికి వచ్చిన రోగులు, వార్డులో అడ్మిట్‌ అయిన రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిశీలన చేశారు. సిబ్బంది సమయపాలన పాటించి, పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి నివేదికలు పురోగతి చెందేలా కృషి చేయాలన్నారు. అనంతరం పదమాయవలస గ్రామాన్ని సందర్శించి అక్కడ చిన్న పిల్లల్లో వ్యాధినిరోధక టీకాలు సకాలంలో వేయబడినవీ, లేనివీ గృహ సందర్శనలు చేసి పరిశీలించారు. డ్రాప్‌ ఔట్స్‌, లెఫ్ట్‌ ఔట్స్‌ పిల్లలను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎమ్‌. శివగాయత్రి, ఇఒ నారాయణరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మలేరియాపై అప్రమత్తంగా కండి
సీతంపేట: మలేరియాపై అప్రమత్తంగా ఉండాలనిజోనల్‌ అధికారి శాంతి ప్రభ అన్నారు. సోమవారం మండలంలోని ధోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మలేరియా రోగులు గురించి తెలుసుకున్నారు. గుజ్జి, మొగధార గ్రామాల్లో ఉన్న మలేరియా రోగుల పరిస్థితి, వైద్యం ఎలా అందుతుంది ఆరా తీశారు. స్ప్రేయింగ్‌ జరిగిందా లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. రోగుల పరిస్థితి, మలేరియా తగ్గు ముఖం పట్టిందా లేదా ఎన్ని కేసులు వస్తున్నాయి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. మలేరియా రోగులు గురించి పరిశీలించారు. మలేరియా రోగులకు దోమతెరలు సరఫరా చేయాలన్నారు. అనంతరం రోగులతో మాట్లాడారు. జెడ్‌ఎఒ వెంట ఎడి ప్రసాద్‌, ఎఎంఒ సూర్యనారాయణ, వైద్యాధికారి భాను ప్రతా ప్‌, కన్సల్టెంట్‌ శ్రీకాంత్‌, ఇఒ తిరుపతిరావు, సభ్యులు అధికారి జె మోహనరావు, ఎంటిఎస్‌ ఝాన్సీ రాణి పాల్గొన్నారు.