Oct 12,2023 19:58

సమావేశంలో మాట్లాడుతున్న విజయ భాస్కర్‌ గౌడ్‌

ప్రజాశక్తి - దేవనకొండ
దేవనకొండ పోలీసు స్టేషన్‌ను పత్తికొండ సర్కిల్‌లోనే ఉంచాలని, ఆలూరు సర్కిల్‌లోకి మార్చరాదని టిడిపి మండల కన్వీనర్‌ విజయ భాస్కర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాలకు ఆలూరు సర్కిల్‌ దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్లు దూరం అవుతుందని తెలిపారు. దేవనకొండ మండల ప్రజలు ఆలూరు సర్కిల్‌కు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. దేవనకొండ మండలం డోన్‌ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా పత్తికొండ సర్కిల్‌లోనే ఉండేదని తెలిపారు. ఇప్పుడు కూడా పత్తికొండ సర్కిల్‌లోనే ఉంచాలని కోరారు. టిడిపి నాయకులు బడిగింజల రంగన్న, ఉచ్చీరప్ప, రామారావు నాయుడు, సర్పంచులు భాస్కర్‌, చిన్న రామప్ప, నాగరాజు గౌడ్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జీలు రాజశేఖర్‌ గౌడ్‌, రాజగోపాల్‌ గౌడ్‌ పాల్గొన్నారు.