Aug 12,2023 20:03

నూతన పైపులైను వేయడానికి తవ్వుతున్న సిబ్బంది

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని బంటనహాల్‌ గ్రామంలో దేవాలయాల దగ్గరకు వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పించేందుకు నూతన పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచి సుశీలమ్మ తెలిపారు. శనివారం బంటనహాల్‌ గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో గ్రామచావిడి దగ్గర ఉన్న ప్రధాన దేవాలయాలు సుంకులమ్మ దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడకూడదని పంచాయతీ నిధులతో నూతన పైపులైన్‌ ఏర్పాటు చేసి, కొత్త ట్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి వసతి కల్పిస్తున్నందుకు భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచి తనయుడు సురేష్‌ పాల్గొన్నారు.