మాట్లాడుతున్న ప్రిన్సిపల్ మురళీమోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - ఆదోని
దేశ భాషలందు తెలుగు లెస్స అని 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' సంస్థ పేర్కొందంటే గొప్ప తనం ఎలాంటిదో అర్థమవుతుందని ప్రిన్సిపల్ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా మంగళవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కళాశాల పూర్వ తెలుగు విభాగాధిపతి వై.నారాయణరెడ్డి హాజరై తెలుగు భాష విశిష్టతను విద్యార్థులకు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ సురేష్, అధ్యాపకులు అయ్యప్ప, బాలస్వామి, ఎర్రిస్వామి, తెలుగు విభాగం నుంచి వెంకటేశ్వర్లు, నరసింహులు, సంతోషి పాల్గొన్నారు.










