సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమానికి రూ.50 వేలు విరాళం
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
పట్టణంలో సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమానికి దాతలు అందిస్తున్న సహకారం హర్షణీయమని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్థానిక సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి బుట్టాయగూడెంకు చెందిన వర్జినియా పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు నాయుడు రూ.50 వేల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ వృద్ధాశ్రమ నిర్వహణకు మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి వృద్ధులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జయవరపు శేఖర్, వామిశెట్టి వెంకటేశ్వరరావు, గరికిపాటి రవీంద్ర, వామిశెట్టి శివ, వామిశెట్టి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.










