Nov 01,2023 19:09

మాట్లాడుతున్న ఎంయల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశకి-గుడ్లూరు : దాతల సహకారం ఎన్నటికీ మరువలేనిదని ఎంఎల్‌ఎ మాను గుంట మహీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. గుడ్లూరు వైద్య ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారంతో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మీటింగ్‌ హాలును ఎంఎల్‌ఎ బుధవారం ప్రారం భించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్‌ మారుతీ రావు అధ్యక్షతన సభ జరిగింది. ఎంఎల్‌ఎ మాట్లాడారు. సమావేశం మందిరం నిర్మించడానికి సహ కరించిన దాతలు అందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఆశా వర్కర్లు కోసం మీటింగు హాలు నిర్మించాలని ఎంతో కషి చేసిన వైద్యాధికారి డాక్టర్‌ మారుతి రావుని ఎమ్మెల్యే అభినందించారు. ఆహారంలో వచ్చిన మార్పులు కారణంగా బీపీ, షుగర్‌ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మన పూర్వీకులు తినే ఆహార పదార్థాలు ప్రస్తుత కాలంలో అందరికీ అవసరమైన రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలతో తయారుచేసిన ఆహార పదార్థాల వినియోగించాలని సూచించారు. ఎంపిడిఒ తహశీల్దార్‌ సూర్య నారాయణ సింగ్‌ డి ఎం ఎస్‌ సి ఓ డాక్టర్‌ ప్రియా గ్రామ సర్పంచి శంకర్‌ ఉన్నారు.