Jul 27,2023 11:55

ప్రజాశక్తి-ఘంటసాల :  చల్లపల్లి, ఘంటసాల మండల పరిధిలో గత నాలుగు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నీట  మునిగిన వరి పొలాలను సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పరిశీలించడం జరిగింది. కృష్ణా జిల్లా రైతు సంఘం నాయకులు వాకా రామచంద్రరావు మాట్లాడుతూ డ్రైనేజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల అన్ని చిన్న పెద్ద డ్రైనేజీల్లోనూ గుర్రపు డెక్క తూటి కాడ పేరుకుపోవడంతో వర్షపు నీరు పోయే పరిస్థితి లేక డ్రైన్లు ఎగదన్నడంతో వేల ఎకరాల్లో ఎదజల్లిన వర్రీ, నాట్లు వేసిన వర్రీ పంట, నాట్లు వేయడం కోసం సిద్ధం చేసుకున్న నారుమల్లు  పూర్తిగా కుళ్లిపోయాయని అన్నారు.  వెంటనే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన డ్రైన్లు పుడికలు తీయించి నష్టపోయిన రైతులకు వెంటనే వరి విత్తనాలు 10000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ చల్లపల్లి మండల కార్యదర్శి యద్దనపూడి మధు, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మహమ్మద్ కరీముల్లా,  వ్యవసాయ కార్మిక సంఘం చల్లపల్లి మండల అధ్యక్షులుమేడేపల్లి వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల నాయకులువందలపాటి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు గల్లా వెంకటేశ్వరరావు, రైతు వెనుకళ్ళ గోపికృష్ణ సందర్శించారు.