ప్రజాశక్తి-కొయ్యలగూడెం : మండలం కన్నాయిగూడెం గ్రామంలో చేతికి రావలసిన వరి పంటలు నాశనమయ్యాయి. సకాలంలో నాణ్యమైన కరెంటు అందకపోవడం వల్ల వరి చేలకి తడి చేరకపోవడం వల్ల కంకి తయారవ్వకుండానే ఎండిపోయాయి అని రైతులు వాపోతున్నారు. కొయ్యలగూడెం సబ్ స్టేషన్ నుంచి కన్నాయిగూడెం లైన్ కి రావలసిన కరెంటు ఆగిపోవడం వల్ల దాదాపుగా 100 ఎకరాల పైన నష్టపోయినట్టు రైతులు పేర్కొన్నారు. ఇంకొక నెల 10 రోజుల్లో చేతిలో వస్తుంది అనుకున్న పంట, ఇలా మధ్యలోనే నాశనం అవ్వడం వల్ల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పంట పండిన పండకపోయినా యజమానులకు కవులు చెల్లించాలి, వాతావరణ పరిస్థితుల వల్ల వానలు పడ్డ పడకపోవడం వల్ల సర్కార్ అందించే కరెంటు మీదే రైతులు ఆధారపడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన సకాలంలో కరెంటు అందడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని అంత నష్టాన్ని ప్రభుత్వ భరించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.










