ప్రజాశక్తి-ఉంగుటూరు : మండలం – నాచుగుంట గ్రామం మెట్ట ప్రాంతంలో విద్యుత్ కోతలతో సాగునీరు అందక ఎండిన వరి పంట పొలాలను ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. విద్యుత్ కోతలతో ఎండిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించాలి. ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామ పరిధిలో విద్యుత్ కోతలతో సాగునీరు అందక ఈనిక మరియు పొట్ట దశలో ఉన్న పంట పొలాలను స్థానిక రైతులు మరియు తెదెపా నాయకులతో కలిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. గన్ని మాట్లాడుతూ.. అసమర్థ ముఖ్య మంత్రి రాజ్యమేలితే ప్రజలు అవస్థలు పడవలసిందే. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ రైతుల పాలిట రాక్షసుడు గా తయారయ్యాడు. గత నెల రోజులుగా రైతులకు విద్యుత్ ఎప్పుడూ వస్తుందో ఎపుడు పోతుందో తెలియనై పరిస్థితి. 9 గంటలు ఇస్తా పగటి పూట అంటూ చెప్పి ఏడుగంటలు కూడా ఒకే దపా ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్. గత వారం రోజులుగా రైతులకు విద్యుత్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్క అధికారి గాని నాయకులు గాని అధికారపార్టీ ప్రజా ప్రతినిధులుగాని రైతుల వద్దకు వెళ్ళి కష్టాలు తెలుసుకున్న పాపానపోలేదు వారికి భరోసా కల్పించలేదు. అధికారపార్టీ నాయకులకు తెలీయదా పరిస్థితులు రైతులు పడుతున్న కష్టాలు. తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేని నువ్వు పరిపాలనకు అనర్హుడవు అంటూ ధ్వజమెత్తారు.










