Oct 23,2023 12:50
  • కారంచేడులో భారీ స్థాయిలో ఆగిపోయిన వాహనాలు

ప్రజాశక్తి-కారంచేడు : వరి రైతులకు కొమ్ముమూరు కెనాల్ నుంచి తక్షణమే సమృద్ధిగా నీరు విడుదల చేయాలని కారంచేడులో సోమవారం నాడు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. కొమ్మమూరు కెనాల్ కు మీరు తక్షణమే విడుదల చేసి కాల్వ కింద సాగు చేస్తున్న వరి రైతులను వెంటనే ఆదుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం నాడు కారంచేడు కాలువ సెంటర్లో జరిగిన రైతుల రాస్తారోకోలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి రమాదేవి మాట్లాడుతూ కారంచేడు పరిసర ప్రాంతా రైతులు కొంమ్మమూరు కెనాల్  కింద నీరు వస్తుందని ఆశతో వేలాది ఎకరాలు సాగు చేశారని వీరిలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువమంది ఉన్నారని, అప్పులు తీసుకొచ్చి పంటలకు పెట్టుబడి పెట్టి సాగు చేసే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ముందు చూపు లేకపోవడం వలన రైతులకు నీరు అందకుండా పోయిందని ఈ నేపథ్యంలో ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకోలేకపోతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి రైతులకు నీరు విడుదల చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కృష్ణ కాల్వ కింద  కింద పంట కాలువలు కూడా రైతులు చందాలు వేసుకొని త్రవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీనికి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఇంజన్లతో కొద్దిపాటి నీరును పంటలకు మళ్లించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బాపట్ల జిల్లా నాయకులు సిహెచ్ గంగయ్య ,డివిజన్ నాయకులు పీ కొండయ్య, బాబురావు ,జి ప్రతాప్ కుమార్ , ఎం వసంతరావు,ఆర్ వినోద్, కృష్ణమోహన్, రావి శేషయ్య, మాలెంపాటి నారాయణ ,కొల్లా సోమశేఖర్, రావి శ్రీనివాసులు తదితరులు రైతులు పాల్గొన్నారు.