- మణిపూర్ మారణకాండను ఖండించండి
- సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలలుగా సాగుతున్న నరమేధాన్ని సృష్టిస్తున్న దానికి మూల కారణమైన బిజెపి విద్వేష రాజకీయాలను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని సిపిఎం ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో అబ్దుల్ దేశాయి అధ్యక్షతన నిరసన కార్యక్రమం పూల బజార్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం. రాజశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం .విజయ్ హాజరై మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన మతకలహాలు సృష్టిస్తూ మణిపూర్ రాష్ట్రంలో మూడు నెలలుగా మారణకాండ కొనసాగిస్తున్నారని, దాడులు చేయించడం మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని బిజెపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికే 145 మందిని బలి తీసుకున్న బిజెపి ప్రభుత్వం శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా గిరిజన తెగలమద్య చిచ్చుపెట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించారని మైనార్టీలైన కుకిలపై మైథిలతో దాడులు చేయించడమే కాక కుకీలపై కొక్కేన్ వంటిమాదకద్రవ్యాలు తయారుచేసేవారిగా, డ్రగ్ మాఫియాగా ముద్ర వేసి రాష్ట్రం నుండి వెళ్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బిజెపి శక్తులు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో అల్లరి మూకలు పెట్రేగిపోయి వందల సంఖ్యలో చర్చిలను తగులబెట్టి అందులో కుకీలను సజీవ దహనం చేసిన ఘటనలు ఉన్నాయని వాపోయారు. మణిపూర్ రాష్ట్రంలో ఇంత ఘోరాతి ఘోరం జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టి పట్టినట్టు వ్యవహరించడం దాని వెనక బిజెపి హస్తం ఏ పాటీదో మన కర్తమవుతుందని తెలియజేశారు. ఈ దారుణాలని పార్లమెంటులో చర్చకు కూడా రానీయకుండా బిజెపి ప్రయత్నం అంతా, ఇంతా కాదని విమర్శించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించిన తర్వాత అల్లర్లు, విధ్వంసకాండ ఇంకా పేట్రేగిపోయిందంటే బిజెపి పాలనలో అల్లరి మూకలకు అమిత్ షా ఏ రకమైన సందేశం ఇచ్చి వెళ్లారో మనకు అర్థమవుతుందని ప్రజలకు తెలియజేశారు. తక్షణమే మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి, దాడులకు పాల్పడిన వారి అందరిని కఠినంగా శిక్షించాలని, బాధితులందరికీ పునరావాసం ఏర్పాటు చేసి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పార్వతయ్య, కె.వి.సుబ్బయ్య, కె.రాజగోపాల్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామకృష్ణ, నగర కమిటీ సభ్యులు నాగస్వాములు, మల్లికార్జున, ఇంతియాజ్, రాంబాబు, ఖలీల్, ఈశ్వర్ మద్దిలేటి, సుంకన్న, రాందాసు, సుధాకర్, రాముడు తదితరులు పాల్గొన్నారు.










