Jun 10,2023 16:40

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : విద్యుత్తు కన్జ్యూమర్ చార్జీ, ఇంధన సర్దుబాటు చార్జీ, ట్రూఅప్ చార్జీల పేరుతో మూడు రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేసిన 20వేల కోట్ల అదనపు విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బూర. సుబ్రహ్మణ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ అదనపు చార్జీలను, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో వేస్తున్న భారలకు వ్యతిరేకంగా శనివారం స్థానిక కోనేరు సెంటర్ లో ధర్నా నిర్వహించి కరెంట్ బిల్లులను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా  సుబ్రమణ్యం  మాట్లాడుతూ వినియోగదారుడు 10 సంవత్సరాల క్రితం వాడుకున్న కరెంటుకిబిల్లు ఆనాడే చెల్లించటం జరిగిందని, కానీ వైసిపి ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం వాడిన  కరెంటుకి, యూనిట్ కి 40 పైసలు చొప్పున ఇంధనకు సర్చార్జి, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వసూలు చేయటం అన్యాయమన్నారు.  దీనికి తోడు స్మార్ట్ మీటర్ల పేరుతో రాబోయే 120 నెలల పాటు గృహానికి 120 రూపాయల నుంచి 200 రూపాయలు వసూలు చేయటం ప్రజలపై అధిక భారం అని ఈ భారలను వెంటనే ఉపసంహరించుకోవాలని  డిమాండ్ చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు కొడాలి. శర్మ మాట్లాడుతూ గతంలో ఈ భారాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన  ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఈనాడు ప్రజలపై భారలు వేయటం సరైంది కాదన్నారు. ఈ సర్దుబాటు పేరుతో వేస్తున్న విద్యుత్తు  అదనపు భారాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద,మధ్య తరగతి, ధనిక, అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రజలపై ఇంధన సర్దుబాటు పేరుతో వేల కోట్లు రూపాయలు ప్రజలపై వేస్తున్న భారాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు సిహెచ్ జయ రావు, ఎండి యూనస్, టి చంద్రపాల్, ఐద్వా  కార్యదర్శి కే సుజాత, ఎల్ఐసి యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, పార్టీ నాయకులు డి సత్యనారాయణ, ఎంఏ బెనర్జీ, జే నాగ శివ తదితరులు  పాల్గొన్నారు.