ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ నగరాభివృద్ధి మరియు కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై ఈనెల 26వ తారీకు నుండి 31వ తారీకు వరకు జరుగుతున్నపాదయాత్రలను జయప్రదం చేయాలని కోరుతూ మూడవరోజు కొనసాగిన పాదయాత్ర ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూల్ నగరాభివృద్ధి మరియు కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధిపై చేపట్టిన పాదయాత్ర మూడవ రోజుకు చేరుకుంది. ఆదివారం బిర్లగడ్డ కాలనీ నుండి ప్రారంభమై గాయత్రి ఎస్టేట్,ఠాగూర్ నగర్, బి క్యాంపు, అరోరా నగర్, సిల్వర్ జూబ్లీ కాలేజ్ వరకు కొనసాగింది. పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందనలభించింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర నాయకులు సి.శేషాద్రి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి.రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.నరసింహులు, సి.హెచ్ సాయిబాబా, కె.సుధాకరప్పలు పాదయాత్రకు విచేసిన ప్రజలనుఉద్దేశించి మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంకోసం పాదయాత్రను చేపట్టిందని, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజాసమస్యలను పక్కనపెట్టి, అధికారమే లక్ష్యంగా ఓటు రాజకీయాలు చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ దొంగేదొంగ అనీఅరిచిన చందంగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మీబూటకపు మాటలను ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. ఒకపక్క జిల్లా అన్ని రంగాల్లో వెనకబడింది. జిల్లా అభివృద్ధి గురించి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, అధికార వైయస్సార్ పార్టీ , బిజెపి , జనసేన పార్టీలు గడిచినగత నాలుగు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలేదేవుళ్లంటూ మాయ మాటలు చెప్పి మన ముందుకు వస్తున్నారు. కాబట్టి రాజకీయనాయకులకు
తగిన గుణపాఠం చెప్పాలి. సిపిఎం పార్టీ ఈజిల్లాలో ప్రాజెక్టులు నిర్మించాలని, పరిశ్రమలు పెట్టాలని, త్రాగునీరు సాగునీరు ఇవ్వాలని, విద్యా, వైద్యం,
పట్ల శ్రద్ధపెట్టాలని, ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను ఆపాలని అన్నారు. గుంతలమయమైనటువంటి రహదారులను కొత్తరోడ్లు వేసి ప్రజలన
ప్రమాదాల నుండి కాపాడాలని, రాయలసీమ, ఉర్దూ యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కర్నూలు జిల్లా సమగ్రఅభివృద్ధికై 10వేలకోట్ల నిధులు కేటాయించి కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. కర్నూల్ నగరంలోఇప్పటికీ
త్రాగునీటి సమస్య చాలాతీవ్రంగా ఉంది. కర్నూలు నగరంలో సగం భాగం కల్లూరు ప్రాంతం, గణేష్నగర్, చెక్పోస్ట్, టెలికంనగర్, సంతోష్ నగర్ వంటి ప్రాంతాల్లో మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి నీళ్లువస్తున్నాయి. కానీ ఈఎమ్మెల్యేలకు, మేయర్కు కార్పొరేటర్లకు ప్రజలకు
త్రాగునీరు ఇవ్వలేనప్పుడు వీళ్లకు పాలించే అధికారంలేదు. అందుకనే సిపిఎం పార్టీగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించిప్రజలకురోజు త్రాగునీరుఇవ్వాలని సిపిఎం పార్టీగా అధికారులను కోరుతున్నాం. కర్నూలు ప్రభుత్వఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి డాక్టర్లు, సిబ్బంది, మందుల కొరత లేకుండా అభివృద్ధి చేయాలి. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కరెంటు చార్జీలు, ఆర్టీసీచార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను మొదలగు భారాలకు వ్యతిరేకంగా, సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమయ్యింది ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఈనెల 26వ తారీకు నుండి ఆదోనిలో మహా పాదయాత్ర ప్రారంభమై ఈనెల 31వ తారీకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని వేలాది మందితో ముట్టడి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ పోరాటంలో విద్యావంతులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు బి.రాధాకృష్ణ,ఎస్.మమ్మద్ రఫీ, శంకర్, హుస్సేన్ భాష, రామకృష్ణ,భాస్కర్,సి.శ్రీనివాసులు, ఎస్.అజ్మత్ టి. రంగయ్య, శ్రీను, వి. సుధాకర్,మౌలాలి, బిర్లాగడ్డ హమాలీలు, వేర్హౌస్ హమాలీలు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










