Jul 30,2023 16:02
  • రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూరి 

ప్రజాశక్తి-దేవనకొండ : ఆదోని నుండి కర్నూలు వరకు ఆగస్టు 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని జిల్లా సమగ్ర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాలని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ సిపిఎం నిర్వహించిన మహాపాదయాత్రను జయప్రదం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి సూరి కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రైతులేసినటువంటి అన్ని పంటలకు ఇన్పుడ్ సబ్సిడీ అందించాలని, నకిలీ విత్తనాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రైతుల ఆత్మహత్యలు నివారించి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి  ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.